http://apvarthalu.com/

Sunday, November 25, 2012

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోం:కిరణ్ కుమార్ రెడ్డి

 వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పిల్ల్రలకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. కాంగ్రెసు పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. జగన్ తన కంపెనీలో పెట్టుబడులపై చంచల్‌గూడ జైలుకు వెళ్లారన్నారు. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేసి వెళ్లలేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, పలు పథకాలతో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. వాన్ పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావును వెనుకేసుకొచ్చారు. ఓ మంత్రిగా ఏం చేయాలో అప్పుడు ఆయన అదే చేశారన్నారు. ఈ సందర్భంగా కిరణ్ పలు పథకాలు ప్రకటించి, ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు.red more

Saturday, November 24, 2012

జగన్ పార్టీలోకి చూద్దాం:కావూరి సాంబశివ రావు


పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశానని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలిచి, మాట్లాడితే రాజీనామాపై పునరాలోచిస్తానని కాంగ్రెసు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. ప్రస్తుతానికి రాజీనామాకే కట్టుబడి ఉన్నాఆయన అన్నారు.
నూజివీడులో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యలో వచ్చిన వ్యక్తులను అందలం ఎక్కిస్తూ, పార్టీ కోసం శ్రమించిన వారిని విస్మరించటం బాధాకరమన్నారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారా అని అడిగితే, 'ఈ విషయం పత్రికల్లోనే వస్తోంది. చూద్దాం. ఆలోచిద్దాం' అంటూ సమాధానం దాటవేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి మనస్ఫూర్తిగా ఇష్టంలేకున్నా, పార్టీ సీనియర్‌ల పట్ల చూపుతున్న వివక్ష, వారికి జరుగుతున్న అన్యాయం వల్ల విసిగి వేసారి రాజీనామా చేసినట్లు చెప్పారు.

Friday, November 23, 2012

‘డమరుకం’ను తెలంగాణాలో అడ్డుకుంటాం

ఢమరుకం చిత్రం పేరుకు సంబంధించిన సర్వహక్కులు తమవేనంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ జేఏసీ చైర్మన్ జైహింద్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ ఢమరుకం పేరును ముందు తమకు కేటాయించి అనంతరం ఢమరుకం చిత్ర నిర్మాత శ్రీధర్‌డ్డికి కేటాయించడం అన్యాయమన్నారు. తెలంగాణకు చెందిన నిర్మాతలు, దర్శకులు రూపొందిస్తున్న చిత్రాల ఫలితాలు సీమాంధ్ర దర్శక, నిర్మాతలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు కళ్యాణ్‌తోపాటు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.డమరుకం సినిమా టైటిల్‌ తనదని దర్శక, నిర్మాత నవీన్‌ కల్యాణ్‌ హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము టైటిల్ 2008లో రిజిష్టర్ చేయించాననీ, 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా పూర్తి అవడం ఆలస్యం అయిందని నవీన్ కళ్యాన్ వివరించారు.తాము డమరుకం టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామని.... అయితే ఆర్ఆర్ మూవీ వారు ‘డ' బదులు ‘ఢ' తగిలించి ‘డమరుకం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అలా జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని, డమరుకం... ఢమరుకం పెద్ద తేడా ఏముందని ఆవేదన వ్యక్తం చేసారు.

శాసనసభకే పోటీ చేస్తా…బాలకృష్ణ

2014 సాధారణ ఎన్నికల్లో పోటీ అంశంపై  హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారాన్ని బాలయ్య తోసిపుచ్చారు. పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. పార్టీలు మారేవారంతా అవకాశవాదులని, కొందరు స్వార్థం కోసమే వలసలు వెళ్తున్నారని ఆయన తెలిపారు. వలసల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వలసలు సాధారణమేనని ఆయన అన్నారు. స్వార్థంతోనే ఇతర పార్టీలకు కొంత మంది వలసలు పోతున్నారని ఆయన విమర్శించారు.red more

Tuesday, November 20, 2012

రాష్ట్రంలో సానుభూతి భయం

జగన్ జైల్లో ఉండడం ప్రత్యర్థులకు ఒక రకంగా లాభిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే గనుక… ‘జైల్లో ఉన్నాడనే సానుభూతితోనే ఓట్లు పడ్డాయని, సీబీఐ మీద, న్యాయవ్యవస్థ మీద తాము తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రభావం చూపించగలిగి ఉన్నా… ఆయనను బయటకు పంపి సానుభూతిని పలుచనచేసి ఉండేవార’మని కాంగ్రెస్ వారు ఆ తర్వాత అయిదేళ్లపాటూ ఆత్మవంచన చేసుకుంటూ బతికేయవచ్చు. అలాగే… ‘కాంగ్రెస్ పార్టీ జగన్‌తో కుమ్మక్కు అయిందని, అందుకే ఆయనను జైల్లో ఉంచి ఆయనకు సానుభూతి పెరిగి ఓట్లు వెల్లువలా పడేలా దోహదం చేసిందని.. పరోక్షంగా కాంగ్రెస్ జగన్ విజయానికి కారణమైం’దని ఇలా రకరకాల ఆషాఢభూతి మాటలు వల్లెవేస్తూ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతి అయిదేళ్లపాటూ కాలం దొర్లించవచ్చు. ఇందుకు పనికొస్తుందే తప్ప… ఆయనను జైల్లో ఉంచడం అనేది… వైకాపా పట్ల ప్రజల్లో సానుభూతి పవనాలు రెట్టింపు కావడానికి కారణం అవుతోంది. వైకాపా ఆవిర్భావం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో అవమానకరమైన వ్యత్యాసాలతో ఓడిపోయిన పార్టీలు …red more

Monday, November 19, 2012

రాష్ట్రంలో వణికిస్తున్న చలి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. శీతాకాలానికి వాయుగుండం తోడు కావడంతో చలి విజృంభిస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన వాయుగుండంతో చలి గాలులు అధికమయ్యాయి. ఏటా నవంబర్ మూడో వారం చలికాలం సీజన్ ప్రారంభమవుతుండగా, ఈ ఏడాది మొదటి వారం నుంచే చలి ప్రతాపం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో 14, 16, 18 డి గ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, గోదావరి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో RED MORE

Saturday, November 17, 2012

ఉద్యోగం వచ్చిన తరువాతే పెళ్లి...సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

స్వశక్తితోనే సాధికారిత సాధ్యం అని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత అంగసాన్‌సూకీ అన్నారు. శనివారం ఉదయం అనంతపురం జిల్లా పాపసానిపల్లిలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనీతీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూకీ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. తమ దేశంలో కూడా పథకాలు అమలు చేస్తామని సూకీ పేర్కొన్నారు.
ఉద్యోగాలు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాయిలకు సలహా ఇచ్చారు. మడకశిరలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సిఎం అయిన తరువాత లక్షా 20వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్యోగాల భర్తీలో సిఫారసులకు తావులేదని, ప్రతిభకే పట్టం అన్నారు. తాను, రఘువీరా రెడ్డి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆయన త్వరగా మంత్రి అయ్యారని తెలిపారు. తనకు మంత్రి పదవి రాలేదని, ఇక ఎప్పటికీ మంత్రిని కాలేనని ఆయన అన్నారు.