అసలు తెలంగాణయే వద్దు మొర్రో అంటుంటే.. సమైక్యాంధ్రను రెండు ముక్కలు చేయడమే కాకుండా, చారిత్రక రాయలసీమను విభజించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారన్నది రాయలసీమ వాసుల బాధ. దీనికి భిన్నంగా తెలంగాణ వాదులు మాకు పది జిల్లాల తెలంగాణ చాలు… ఇంకేవీ మాకొద్దు అంటున్నారు. నిన్నటి వరకు వినిపించిన రాయలతెలంగాణ ఊసు ఈరోజు లేదు. అంతలో ఏం జరిగింది? అంటే… టీఆర్ఎస్ మేము గట్టిగా డిమాండ్ చేయడం వల్లే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకుంటున్నారు. నిజానికి రాయల తెలంగాణ ప్రతిపాదన వెనక్కుపోవడం వెనుక సీమ హస్తం ఉంది. కేంద్రంలో మంత్రులుగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీజీవెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డి తదితరులు ఎలాగూ సమైక్యాంధ్రను విడగొట్టకుండా ఆపలేకపోయారు. కనీసం రాయలసీమను విడగొట్టకుండా కాపాడి చారిత్రక ప్రత్యేకతను, దాని ఔన్నత్యాన్ని కాపాడమని పట్టుబట్టారు.red more
No comments:
Post a Comment