http://apvarthalu.com/

Wednesday, November 28, 2012

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్

సినీ పరిశ్రమలోకి డైలాగ్ రైటర్ గా తన ప్రస్తానం ప్రారంభించిన త్రివిక్రమ్ తన పదునైన రచనా నైపుణ్యంతో అనతి కాలంలోనే పాపులర్ డైలాగ్ రైటర్‌గా ఎదిగారు. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు కేవలం 5 మాత్రమే. అయినా అతని సినిమాలంటే జనాల్లో మహా క్రేజ్ ఏర్పడిందంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు.red more

చెయ్యెత్తితే బస్పు ఆగదు..బొత్స నిర్వాకం !


వెనకటికి ఓ కథ ఉంది. ఆ కథలో కుక్క, గాడిద ఉంటాయి. ఓ రోజు కుక్క చేయాల్సిన పని అత్యుత్సాహంతో గాడిద చేస్తుంది. దాని పర్యావసానం గాడిద నడ్డి విరుగుతుంది. కాకాలు పట్టి, అడుగులకు మడుగులొత్తి రాజకీయాల్లో చేరి అమాత్యులైనవారు నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో తాజాగా ఆర్టీసీ లో తీసుకుంటున్న నిర్ణయాలు తేల్చిచెబుతున్నాయి. మందు దందా చేసే వారు మంత్రులయితే ఎలా ఉంటుందో తాజాగా బొత్స నిర్ణయం అలాగే ఉంది.
రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ఇటీవలె ఛార్జీలు పెంచారు. అయినా ఆర్టీసి రూ.4200 కోట్లు అప్పులు ఉంది. నెలకు రూ.100 కోట్లు వడ్డీ చెల్లిస్తుంది. అయినా కార్మికుల జీతాల కోసం ప్రతి నెలా రుణాలు తేవాల్సి వస్తోందట. అందుకే ఈ నష్టాల భర్తీకి మరోసారి ప్రయాణీకుల మీద భారం మోపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రయాణికుడి నుండి అర్ధ రూపాయి నుండి రూపాయి దాకా సర్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికి ఆ శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ సంతకం కూడా చేసేశారు. ఇక ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి.  ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది అది ఏంటంటే ఆర్టీసీలో ఫ్లాట్ ఫాం టికెట్ ప్రవేశ పెడతారట. అంటే రైల్వేస్టేషన్లలో మాదిరిగా అన్నమాట. బస్టాండుకు వచ్చిన ప్రతి ప్రయాణికుడి ఈ డబ్బులు వసూలు చేసి ఆయా బస్ స్టేషన్ల నిర్వహణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారట.red more

పార్టీ - పార్టీ నడుమ కోదండరామ్


నారీ నారీ నడుమ మురారి అన్నట్లు రెండు తెలంగాణ పార్టీల మధ్య తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపిల మధ్య విభేదాలు కోదండరామ్‌కు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. రెండు తెలంగాణ పార్టీల మధ్య వైరాన్ని నివారించేందుకు తెలంగాణ రాజకీయ జెఎసి నడుం బిగించింది.
మంగళవారం సమావేశమైన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఆవశ్యకతను గుర్తించింది. రెండు పార్టీల మధ్య విభేదాలు తెలంగాణవాదానికి నష్టం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ జెఎసి అభిప్రాయపడుతోంది. డిసెంబర్ 1వ తేదీన తలపెట్టిన విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశానికి జెఎసి రెండు పార్టీలను కూడా ఆహ్వానించింది.red more

Tuesday, November 27, 2012

మన రాష్ట్రంలో దేవుడు తలలు పగులగొట్టుకోమన్నాడా?

మొహరం సందర్భంగా షియా భక్తులు తలలు పగులకొట్టుకోవడం, గుండెలపై బాదుకోవడం...
కర్నూలుజిల్లా దేవరగట్టులో భక్తులు దేవుడ్ని దక్కించుకోవడానికి కర్రల సమరం. పగిలే తలలు..
గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ వేయించుకోవడం, ముళ్ళ కిరీటాలు ధరించడం...
కాళీమాతకు తన నాలుక కోసి అర్పించిన భక్తుడు...
దేవుడ్ని చూడాలనే తపనతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భక్తుడు....red more

Sunday, November 25, 2012

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోం:కిరణ్ కుమార్ రెడ్డి

 వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పిల్ల్రలకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. కాంగ్రెసు పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. జగన్ తన కంపెనీలో పెట్టుబడులపై చంచల్‌గూడ జైలుకు వెళ్లారన్నారు. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేసి వెళ్లలేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, పలు పథకాలతో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. వాన్ పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావును వెనుకేసుకొచ్చారు. ఓ మంత్రిగా ఏం చేయాలో అప్పుడు ఆయన అదే చేశారన్నారు. ఈ సందర్భంగా కిరణ్ పలు పథకాలు ప్రకటించి, ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు.red more

Saturday, November 24, 2012

జగన్ పార్టీలోకి చూద్దాం:కావూరి సాంబశివ రావు


పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశానని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలిచి, మాట్లాడితే రాజీనామాపై పునరాలోచిస్తానని కాంగ్రెసు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. ప్రస్తుతానికి రాజీనామాకే కట్టుబడి ఉన్నాఆయన అన్నారు.
నూజివీడులో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యలో వచ్చిన వ్యక్తులను అందలం ఎక్కిస్తూ, పార్టీ కోసం శ్రమించిన వారిని విస్మరించటం బాధాకరమన్నారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారా అని అడిగితే, 'ఈ విషయం పత్రికల్లోనే వస్తోంది. చూద్దాం. ఆలోచిద్దాం' అంటూ సమాధానం దాటవేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి మనస్ఫూర్తిగా ఇష్టంలేకున్నా, పార్టీ సీనియర్‌ల పట్ల చూపుతున్న వివక్ష, వారికి జరుగుతున్న అన్యాయం వల్ల విసిగి వేసారి రాజీనామా చేసినట్లు చెప్పారు.

Friday, November 23, 2012

‘డమరుకం’ను తెలంగాణాలో అడ్డుకుంటాం

ఢమరుకం చిత్రం పేరుకు సంబంధించిన సర్వహక్కులు తమవేనంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ జేఏసీ చైర్మన్ జైహింద్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ ఢమరుకం పేరును ముందు తమకు కేటాయించి అనంతరం ఢమరుకం చిత్ర నిర్మాత శ్రీధర్‌డ్డికి కేటాయించడం అన్యాయమన్నారు. తెలంగాణకు చెందిన నిర్మాతలు, దర్శకులు రూపొందిస్తున్న చిత్రాల ఫలితాలు సీమాంధ్ర దర్శక, నిర్మాతలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు కళ్యాణ్‌తోపాటు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.డమరుకం సినిమా టైటిల్‌ తనదని దర్శక, నిర్మాత నవీన్‌ కల్యాణ్‌ హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము టైటిల్ 2008లో రిజిష్టర్ చేయించాననీ, 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా పూర్తి అవడం ఆలస్యం అయిందని నవీన్ కళ్యాన్ వివరించారు.తాము డమరుకం టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామని.... అయితే ఆర్ఆర్ మూవీ వారు ‘డ' బదులు ‘ఢ' తగిలించి ‘డమరుకం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అలా జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని, డమరుకం... ఢమరుకం పెద్ద తేడా ఏముందని ఆవేదన వ్యక్తం చేసారు.