http://apvarthalu.com/

Monday, September 16, 2013

ఆరంభశూరులు..అరివీర భయంకరులయ్యారు!

ప్రజలను బ్లఫ్ చేయడం రాజకీయ నాయకులు పెద్ద సంగతేమీ కాదు.. రాజకీయం పరంగా ఎన్నో పొరపాట్లు చేసి, పాలన విషయంలో ప్రజలకు చుక్కలు చూపెట్టి.. తమకు అవసరమైన సందర్భాల్లో ప్రజలను ఏదో విధంగా మాయ చేయడం మన రాజకీయ నాయకులకు చాలా సులభమైన పని. లక్షల కోట్ల స్కామ్ లకు ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వాధి నేతలు.. ఉదయం లేస్తూనే హితబోధలు చేయడం, తమ ముందు ప్రభుత్వాలు జనాలను దోచుకున్నాయని ఆందోళన వ్యక్తం చేయడం, కేంద్రంలో తమపై వస్తున్న ఆరోపణలపై మారు మాట్లాడక.. తమ ప్రత్యర్థులు ఏలుతున్న రాష్ట్రాల్లో అవినీతి ఏరులై ప్రవహిస్తోందని ఆందోళన వ్యక్తం చేయడం చేస్తూనే ఉన్నాం. ఎవరి తీరు ఏమిటో తెలిసిన ప్రజలు కూడా.. ఇదంతా రాజకీయంలే అని సర్దుకుపోతుంటారు. రాజకీయ అనైతికంగా ప్రవర్తించినా.. ఎలాంటి డ్రామాలు ఆడినా.. సాధారణంగా ప్రజలు నాయకులను క్షమించేస్తుంటారు. అయితే తమను రాజకీయ నాయకులు పరోక్షంగా దోచుకున్న సందర్భాల్లో, పన్నులు గట్రా వాటితో ప్రత్యక్ష్యంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో… కూడా ప్రజలు సహనం వహించారు. అయితే.. అన్నింటినీ మౌనంగా భరించే భారతీయులు కూడా భారీ ఉద్యమాలు చేయగలరని, తిరుగుబాటుకు కూడా వెనుకాడరని.. ఆరంభశూరులు అని పేరున్న ఆంధ్రులు 46 రోజులు గడిచిపోయినా.. శూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతల మీద!read more 

1 comment:

Unknown said...

ఇది శూరత్వమేన?
అన్యాయంగా, ఉన్మాదంగా అనిపించడం లేదూ
ఈ శూరత్వం లక్ష్యం
ఇంకో ప్రాంత ప్రజల ప్రజాస్వామిక హక్కులను
కాలరాయడానికోసమే కదా ...?
ఒక తప్పుదు లక్ష్యంతో
ఎంత శూరత్వం ప్రదర్శిస్తే మాత్రం ఏం ఫలితముంటుంది ?
చివరకు మిగిలేది బూడిదే !