Sunday, April 28, 2013
Friday, April 26, 2013
Sunday, April 21, 2013
Monday, April 15, 2013
భారత పేస్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ పెళ్లి
భారత పేసర్ ఉమేశ్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం నగరంలోని తమ ఇంట్లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో... ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ తానియా వాద్వాను వివాహం చేసుకున్నాడు. అయితే ఉమేశ్ మాత్రం తమకు ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని, పెళ్లి ఐపీఎల్ తర్వాత ఉంటుందని మీడియాతో చెప్పాడు. ఏడాది కాలంగా తానియా, ఉమేశ్ ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ జోడీ... సోమవారం రిజిస్టర్లో సంతకాలు చేస్తున్న వీడియోను నాగ్‌పూర్ పత్రిక బయటపెట్టింది. అయితే పెళ్లయిందని చెప్పకుండా... కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగిందని ఉమేశ్ ఎందుకు చెప్పాడనేది ప్రశ్నార్థకం. దీనికి అతడి సన్నిహితులు చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ‘ఐపీఎల్ కాంట్రాక్టు ప్రకారం టోర్నీ జరుగుతున్న సమయంలో పెళ్లి చేసుకోకూడదు’ అని అతడి సన్నిహితుడు ఒకరు చెప్పారు. ‘మా ఇద్దరికీ ఏడాది క్రితం పరిచయం అయింది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. దీంతో ఈ రోజు నిశ్చితార్థం జరుపుకున్నాం. ఐపీఎల్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం’ అని ఉమేశ్ మీడియాతో చెప్పాడు. కానీ సోమవారం జరిగిన కార్యక్రమానికి తానియా తరఫువారు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఐపీఎల్లో ఉమేశ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Subscribe to:
Posts (Atom)