Sunday, March 31, 2013
Saturday, March 30, 2013
Friday, March 29, 2013
తెలంగాణ రైతులకు విద్యుత్ సరఫరాలో అన్యాయం: హరీష్‌రావు
విద్యుత్ సరఫరాలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర రైతులకు ఏడు గంటలు విద్యుత్
ఇచ్చి, తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల సమస్యల
పట్ల ఎవరూ స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కావాలని
అడిగితే రైతులను కాల్చిచంపించింది చంద్రబాబు అయితే ఉన్న విద్యుత్‌ను
సీమాంధ్రకు తరలించుకుపోయింది వైఎస్ అని పేర్కొన్నారు. ఇప్పుడేమో తెలంగాణ
రైతులను సీఎం కిరణ్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన కుర్చీని
కాపాడుకోవడానికి సీఎం ప్రయత్నిస్తున్నాడు కానీ, రైతుల సమస్యలను
పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
Subscribe to:
Posts (Atom)