తెలంగాణపై కేంద్ర మంత్రి వాయలార్ రవి మరోసారి విచిత్రమైన కామెంట్ చేశారు. సోమవారం పలువురు మీడియా ప్రతినిధులు వాయలార్ రవిని తెలంగాణ విషయమై అడిగారు. తెలంగాణపై నెల రోజుల్లో తేల్చుతానని చెప్పారని, ఆ తర్వాత మరో పది పదిహేను రోజులు పట్టవచ్చునని చెప్పారని ఏమయిందని మీడియా ప్రతినిధులు అడిగారు.red more
Monday, March 4, 2013
Sunday, March 3, 2013
Saturday, March 2, 2013
తప్పు చేస్తే ఉరి తీయండి:శంకరరావు కూతురు సుస్మిత
గ్రీన్‌ఫీల్డ్ భూముల వ్యవహారంలో తన తండ్రి ఏదైనా తప్పు చేసి ఉంటే ఉరితీయవచ్చని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానసభ్యుడు పి. శంకరరావు కూతురు సుస్మిత అన్నారు. అంతేకానీ, విచారణ పేరుతో తన తండ్రిని వేధింపులకు గురి చేయవద్దని ఆమె కోరారు. శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె శనివారం మాట్లాడారు. తమ నాన్న అధికారుల విచారణకు సహకరిస్తారని, ఆయన విచారణకు రాలేకపోతే తన ఇంటికి వచ్చి విచారణ చేసుకోవాలని ఆమె అన్నారు. తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. శంకర్రావుపై 41(ఏ), సీఆర్పీసీ 200 సెక్షన్ల కింద నమోదైన కేసులో విచారణకు సహకరిస్తామని, నాన్న తప్పుచేస్తే ఉరితీసుకోండంటూ మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుస్మిత అవేదనతో అన్నారు. ఇదే విషయంపై సిఐడి అధికారులకు మాజీ మంత్రి శంకర్రావు కూతురు సుస్మిత లేఖ అందజేశారు. ఇవాళ ఆమె సీఐడీ కార్యాలయానికి వచ్చి లేఖను అధికారులకు ఇచ్చారు. తన తండ్రి శంకర్రావుకు అనారోగ్యంగా ఉన్నందున సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరుకాలేక పోతున్నారని ఆమె లేఖలో చెప్పారు. గ్రీన్‌ఫిల్డ్ భూముల వివాదం కేసులో మాజీ మంత్రి, కాంగ్రెసు శానససభ్యుడు పి. శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును హైదరాబాదులోని నేరెడ్‌మెట్ పోలీసుల నుంచి సిఐడి తన చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు శనివారం తమ ముందు హాజరు కావాలని సిఐడి అధికారులు శంకరరావుకు నోటీసులు జారీ చేశారు.red more
Thursday, February 28, 2013
Subscribe to:
Posts (Atom)