గ్రీన్‌ఫీల్డ్ భూముల వ్యవహారంలో తన తండ్రి ఏదైనా తప్పు చేసి ఉంటే ఉరితీయవచ్చని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానసభ్యుడు పి. శంకరరావు కూతురు సుస్మిత అన్నారు. అంతేకానీ, విచారణ పేరుతో తన తండ్రిని వేధింపులకు గురి చేయవద్దని ఆమె కోరారు. శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె శనివారం మాట్లాడారు. తమ నాన్న అధికారుల విచారణకు సహకరిస్తారని, ఆయన విచారణకు రాలేకపోతే తన ఇంటికి వచ్చి విచారణ చేసుకోవాలని ఆమె అన్నారు. తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. శంకర్రావుపై 41(ఏ), సీఆర్పీసీ 200 సెక్షన్ల కింద నమోదైన కేసులో విచారణకు సహకరిస్తామని, నాన్న తప్పుచేస్తే ఉరితీసుకోండంటూ మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుస్మిత అవేదనతో అన్నారు. ఇదే విషయంపై సిఐడి అధికారులకు మాజీ మంత్రి శంకర్రావు కూతురు సుస్మిత లేఖ అందజేశారు. ఇవాళ ఆమె సీఐడీ కార్యాలయానికి వచ్చి లేఖను అధికారులకు ఇచ్చారు. తన తండ్రి శంకర్రావుకు అనారోగ్యంగా ఉన్నందున సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరుకాలేక పోతున్నారని ఆమె లేఖలో చెప్పారు. గ్రీన్‌ఫిల్డ్ భూముల వివాదం కేసులో మాజీ మంత్రి, కాంగ్రెసు శానససభ్యుడు పి. శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును హైదరాబాదులోని నేరెడ్‌మెట్ పోలీసుల నుంచి సిఐడి తన చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు శనివారం తమ ముందు హాజరు కావాలని సిఐడి అధికారులు శంకరరావుకు నోటీసులు జారీ చేశారు.red more
Saturday, March 2, 2013
Thursday, February 28, 2013
Wednesday, February 27, 2013
సమైక్య రాష్ట్రమే ఉగ్రవాదులకు అడ్డాగా మారింది: కోదండరాం
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తూ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్
హోదాలో కొనసాగుతున్న కోదండరాం.. తాజాగా ఓ సమావేశంలో బుధవారం పాల్గొన్న
కొదండరాం సమైక్య రాష్ట్రమే ఉగ్రవాదులకు అడ్డాగా మారిందేమోనని అనుమానం
వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినందున ఉమ్మడి
పాలన విఫలమైనట్లుందన్నారు. 60 ఏండ్లపాటు ఉమ్మడిపాలనలతో కాంగ్రెస్ పార్టీయే
ఎక్కువగా అధికారంలో ఉందని, వీటిని ఆపలేకపోయిన ముఖ్యమంత్రి కిరణ్,
మంత్రివర్గ సభ్యుడైన టీజీ వెంకటేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.red more
Tuesday, February 26, 2013
Thursday, February 21, 2013
Subscribe to:
Posts (Atom)