http://apvarthalu.com/

Thursday, February 21, 2013

హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లు: 20 మంది మృతి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ లోని కోణార్క్,వెంకటాద్రి థియేటర్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.భయంతో జనం పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దుర్ఘటన సాయంత్రం 7గంటలకు చోటుచేసుకుంది. తొలి పేలుడు జరిగిన నిమిషం వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.red more

హైదరాబాద్ బాంబు పేలుళ్లు ఫోటోలు