Monday, February 18, 2013
Sunday, February 17, 2013
దేశంలో అవినీతిపై నా పోరాటం:అన్నా హజారే
హైదరాబాద్ లో బహిరంగ సభలో అన్నా హజారే మాట్లాడుతూ.. దేశం కోసం నా జీవితం
అంకితం చేస్తానని అన్నారు. ప్రాణమున్నంత వరకూ జన్‌లోక్‌పాల్ కోసం
పోరాడుతూనే ఉంటానని సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సృష్టం చేశారు.
సికింద్రాబాద్ వెస్లీ కళాశాల మైదానంలో జనతంత్రమోర్చా ఆధ్వర్యలంలో ఏర్పాటు
చేసిన బహిరంగసభలో హజారే పాల్గొని ప్రసంగించారు. కోటీశ్వరులు కూడా పొందలేని
ఆనందాన్ని ప్రజా సేవద్వారా పొందుతున్నానని, ప్రజా సేవలో ఉన్న సంతృప్తి
ఎక్కడా దొరుకదన్నారు. గ్రామాల్లో సాగు నీరు కనీస అవసరాలేవి అందుబాటులో
లేవని ఆవేదన వ్యక్తం చేశారు.red more
Saturday, February 16, 2013
జైలు నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విడుదల
ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శనివారం సాయంత్రం 5.11 గంటలకు బెయిల్‌పై బయటకొచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ ఓవైసీ ఏ-1 నిందితుడిగా ఉన్నారు. ఆయనపై ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టులో ఏడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయా కేసుల్లో శుక్రవారం 437 సెక్షన్ కింద ఆయన బెయిల్ పొందారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వెంకటేశ్వరరెడ్డి బెయిల్ మంజూరు చేశారు. ఎంఐఎం మద్దతుదారులు శనివారం జైలు ప్రాంతంలో స్వీట్లు పంచిపెట్టి టపాసులు కాల్చారు. ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, అక్బరుద్దీన్ వ్యక్తిగత వైద్యుడు మజారుద్దీన్ అలీఖాన్, ఎంఎల్‌సీ అల్తాప్ హైదర్ రజీ, ఎంఐఎం జిల్లా నాయకుడు సిరాజ్‌ఖాద్రీ, పట్టణా«ధ్యక్షుడు ఫారూఖ్ అక్బరుద్దీన్ విడుదలయ్యే వరకు జైలు వద్దే ఉన్నారు. అక్బరుద్దీన్ విడుదల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ కె.వి.కిషన్‌రావు ఆధ్వర్యంలో డీఎస్పీ కె.ఎం.మహేశ్వరరాజు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూఆర్‌టీ(క్విక్ రియాక్షన్ టీం) బృందాలను రంగంలోకి దింపారు. రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. అవసరమున్న చోట బారికేడ్లు పెట్టారు.
Monday, February 11, 2013
Subscribe to:
Posts (Atom)