సీమాంధ్ర పెట్టుబడిదారులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్
అమ్ముడుపోయారని ఓయూ జేఏసీ నేతలు ఆరోపించారు. ఈ నెల 27లోపు తెలంగాణను
ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ మంత్రుల జిల్లాల్లో నో ఎంట్రీ బోర్డులు పెడుతామని తెలిపారు. ఆజాద్
వ్యాఖ్యలతో కాంగ్రెస్ వైఖరి బయటపడిందన్నారు.
Wednesday, January 23, 2013
తెలంగాణపై మరికొంత సమయం కావాలి: ఆజాద్
తెలంగాణ సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్ లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్
గులాం నబీ ఆజాద్ తెలిపారు. సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పట్టే అవకాశం
ఉందని, తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం
జరుగుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో తాను
చెప్పలేనని అన్నారు. నెల రోజులంటే 30 రోజులు కాదని, కొంత సమయం
పడుతుందన్నారు. సున్నితమైన, తీవ్రమైన సమస్య.. మరికొన్ని సంప్రదింపులు
జరపాల్సి ఉందని తెలిపారు.red more
Tuesday, January 22, 2013
ఢిల్లీలో సీమాంధ్ర-తెలంగాణ నేతల పోటాపోటీ భేటీ
దేశ రాజధాని ఢిల్లీ విభజన రాజకీయాలతో వేడెక్కింది. సీమాంధ్ర, తెలంగాణ
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోటాపోటీగా అధిష్టానం పెద్దలను కలిసి తమ వాదనలు
వినిపిస్తున్నారు.మంగళవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో
సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఎంపీ కేవీపీ, మంత్రులు
శైలజానాథ్, టీజీ వెంకటేష్, ఏరాసు, కాసు, గాదె, ఏపీ ఎన్జీవో నేతలు భేటీ
అయిన వారిలో ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా
ప్రధానికి నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర వ్యవహారా
ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో నేతలు భేటీ అయి తమ వాదనను వినిపించారు.ఇదే సమయంలో అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కేంద్ర హోంశాఖ మంత్రి
సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయి తెలంగాణ వాదాన్ని వినిపించారు. మరికొందరు
అధిష్టానం పెద్దలను ఇరు ప్రాంతాల నేతలు కలవనున్నారు.
వేడెక్కిన 'తెలంగాణ'
తెలంగాణ అంశం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కింది. ప్రత్యేక రాష్ట్రం
ఇచ్చేస్తున్నారని భారీఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28వ తేదీ లోపల
తెలంగాణపై ప్రకటన చేస్తామని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే
చెప్పడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధుల రెచ్చగొట్టే
వ్యాఖ్యలు కూడా వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రాంతీయ
విద్వేషాలతో పరిస్థితి ఉద్రికత్తతకు దారితీసే ప్రమాదం పొంచి
ఉందనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు ఖరారైనట్లేనని, ఇక ఇతర అంశాలే
మాట్లాడవలసి ఉందని కొందరు చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు
హైదరాబాద్ - నదీ జలాల పంపిణీ - హైదరాబాద్ లో సీమాంధ్రుల భద్రత - ఆంధ్రలో
రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక పాకేజీ ....... అని ఒక వర్గం ప్రచారం
చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమస్యేలేదు - రాష్ట్రం విభజిస్తే
రాజీనామా హెచ్చరికలు - తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ - హైదరాబాద్ కేంద్ర
పాలిత ప్రాంతం..... ఇలా విభిన్న కథనాలు వినవస్తున్నాయి. దీనికి తోడు
ఢిల్లీలో ఏదో జరిగిపోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణ
వచ్చేస్తుందని ఆ ప్రాంత నేతలు గతంలో ఎన్నడూలేనంత గట్టి నమ్మకంతో ఉన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం చేసే ప్రయత్నాలన్నీ తమకు అనుకూలంగా జరుగుతున్నట్లు
వారు భావిస్తున్నారు. ఇంకేముంది తెలంగాణ ఇచ్చేస్తున్నారని, దానిని ఎలాగైనా
అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు ఢిల్లీ వెళ్లారు. వారికి పోటీగా తెలంగాణ నేతలు
కూడా మరోమారు ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక రాజీనామా హెచ్చరికలు
సరేసరి. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు,
రాష్ట్రం విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు
హెచ్చరికలు జారీ చేశారు.red more
Subscribe to:
Posts (Atom)