http://apvarthalu.com/

Tuesday, January 22, 2013

ఢిల్లీలో సీమాంధ్ర-తెలంగాణ నేతల పోటాపోటీ భేటీ

దేశ రాజధాని ఢిల్లీ విభజన రాజకీయాలతో వేడెక్కింది. సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోటాపోటీగా అధిష్టానం పెద్దలను కలిసి తమ వాదనలు వినిపిస్తున్నారు.మంగళవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఎంపీ కేవీపీ, మంత్రులు శైలజానాథ్, టీజీ వెంకటేష్, ఏరాసు, కాసు, గాదె, ఏపీ ఎన్జీవో నేతలు భేటీ అయిన వారిలో ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ప్రధానికి నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర వ్యవహారా ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో నేతలు భేటీ అయి తమ వాదనను వినిపించారు.ఇదే సమయంలో అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయి తెలంగాణ వాదాన్ని వినిపించారు. మరికొందరు అధిష్టానం పెద్దలను ఇరు ప్రాంతాల నేతలు కలవనున్నారు.

వేడెక్కిన 'తెలంగాణ'

తెలంగాణ అంశం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేస్తున్నారని భారీఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28వ తేదీ లోపల తెలంగాణపై ప్రకటన చేస్తామని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రాంతీయ విద్వేషాలతో పరిస్థితి ఉద్రికత్తతకు దారితీసే ప్రమాదం పొంచి ఉందనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు ఖరారైనట్లేనని, ఇక ఇతర అంశాలే మాట్లాడవలసి ఉందని కొందరు చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ - నదీ జలాల పంపిణీ - హైదరాబాద్ లో సీమాంధ్రుల భద్రత - ఆంధ్రలో రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక పాకేజీ ....... అని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమస్యేలేదు - రాష్ట్రం విభజిస్తే రాజీనామా హెచ్చరికలు - తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ - హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం..... ఇలా విభిన్న కథనాలు వినవస్తున్నాయి. దీనికి తోడు ఢిల్లీలో ఏదో జరిగిపోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణ వచ్చేస్తుందని ఆ ప్రాంత నేతలు గతంలో ఎన్నడూలేనంత గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసే ప్రయత్నాలన్నీ తమకు అనుకూలంగా జరుగుతున్నట్లు వారు భావిస్తున్నారు. ఇంకేముంది తెలంగాణ ఇచ్చేస్తున్నారని, దానిని ఎలాగైనా అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు ఢిల్లీ వెళ్లారు. వారికి పోటీగా తెలంగాణ నేతలు కూడా మరోమారు ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక రాజీనామా హెచ్చరికలు సరేసరి. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రాష్ట్రం విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేశారు.red more

అనుష్క ఫోటోలు









Monday, January 21, 2013

హాట్ ఫోటోస్




తెలంగాణ లేఖ వెనక నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడుకు మూడు రోజుల క్రితం పార్టీ నేత సుధీష్ రాంభొట్ల హైదరాబాదు విషయమై ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాదును దేశానికి రెండో రాజధానిని చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారని, ఆ ప్రతిపాదన పైన పార్టీలో చర్చించాలని బాబుకు సుధీష్ సూచించారు. అంబేద్కర్ సూచనను పరిగణలోకి తీసుకుంటే బావుంటుందన్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంత సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా టిడిపి అభిప్రాయం చెప్పడంతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడ్డారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి బాబును టార్గెట్‌గా చేసుకోవడం మానలేదు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు బాబు వల్లే సమైక్యవాదం మైనార్టీలో పడిందని మండిపడుతున్నారు. సీమాంధ్ర నేతలు బాబు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. అవసరమైతే సమైక్యాంధ్ర నినాదంతో బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో సుధీష్ హైదరాబాద్ అంశాన్ని పార్టీలో తెరపైకి తీసుకు వచ్చారు. ఇది పార్టీలో మరింత చర్చకు దారి తీస్తోంది. సుధీష్ అభిప్రాయంతో పార్టీలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారట. తెలంగాణకు అనుకూలంగా టిడిపి ఉందని ప్రజల్లోకి వెళుతున్న సమయంలో సుధీష్ ఇలా చేయడాన్ని తెలంగాణ టిడిపి నేతలు జీర్ణించుకోవడం లేదట. సుధీష్ లేఖ పైన తెరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన లేఖ వెనుక ట్విట్టర్ బాయ్ నారా లోకేష్ ఉన్నాడని ఆరోపించింది.

మాధురి ఫోటోస్








ఎంపీ లగడపాటిది డ్రామా...హరీశ్‌రావు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రను కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుంటాననడం డ్రామా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను మోసగించటానికి వారిద్దరూ కూడబలుక్కొని నాటకమాడుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.