Monday, January 21, 2013
ఎంపీ లగడపాటిది డ్రామా...హరీశ్‌రావు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రను కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్
అడ్డుకుంటాననడం డ్రామా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలను మోసగించటానికి వారిద్దరూ కూడబలుక్కొని నాటకమాడుతున్నారని
సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
పోలీసులు అదుపులోకి హైదరాబాద్ నగరం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు
రేపు సంగారెడ్డి బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్ పి అదనపు
పోలీసు బలగాలను పిలిపించారు.బలవంతంగా షాపులను మూసివేయిస్తున్నారు. బంద్
చేయని దుకాణాలపై రాళ్లతో దాడి చేశారు. పలుచోట్ల దుకాణాదారులు స్వచ్ఛందంగా
షాపులను మూసివేశారు. కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆందోళనకారులు రాళ్లతో దాడి
చేశారు.red more
Sunday, January 20, 2013
తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు...కోదండరామ్
సీమాంధ్ర నేతలు పెత్తనాన్ని కొనసాగించేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి తెలంగాణ రాకుండా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది కేంద్ర అధిష్టానానికి, కాంగ్రెస్ కు పరీక్షా కాలమని కోదండరామ్ అన్నారు. ప్రలోభాలకు లొంగుతారో, ప్రజల ఆకాంక్షను గౌరవిస్తారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయం న్యాయసమ్మతంగా ఉంటే పోలీసు బలగాల అవసరం లేదని కోదండరామ్ అన్నారు. తెలంగాణకు అనుకూల ప్రకటన రాకుంటే భారీ ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
Subscribe to:
Posts (Atom)