జగన్ జైల్లో ఉండడం ప్రత్యర్థులకు ఒక రకంగా లాభిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే గనుక… ‘జైల్లో ఉన్నాడనే సానుభూతితోనే ఓట్లు పడ్డాయని, సీబీఐ మీద, న్యాయవ్యవస్థ మీద తాము తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రభావం చూపించగలిగి ఉన్నా… ఆయనను బయటకు పంపి సానుభూతిని పలుచనచేసి ఉండేవార’మని కాంగ్రెస్ వారు ఆ తర్వాత అయిదేళ్లపాటూ ఆత్మవంచన చేసుకుంటూ బతికేయవచ్చు. అలాగే… ‘కాంగ్రెస్ పార్టీ జగన్‌తో కుమ్మక్కు అయిందని, అందుకే ఆయనను జైల్లో ఉంచి ఆయనకు సానుభూతి పెరిగి ఓట్లు వెల్లువలా పడేలా దోహదం చేసిందని.. పరోక్షంగా కాంగ్రెస్ జగన్ విజయానికి కారణమైం’దని ఇలా రకరకాల ఆషాఢభూతి మాటలు వల్లెవేస్తూ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతి అయిదేళ్లపాటూ కాలం దొర్లించవచ్చు. ఇందుకు పనికొస్తుందే తప్ప… ఆయనను జైల్లో ఉంచడం అనేది… వైకాపా పట్ల ప్రజల్లో సానుభూతి పవనాలు రెట్టింపు కావడానికి కారణం అవుతోంది. వైకాపా ఆవిర్భావం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో అవమానకరమైన వ్యత్యాసాలతో ఓడిపోయిన పార్టీలు …red more
Tuesday, November 20, 2012
Monday, November 19, 2012
రాష్ట్రంలో వణికిస్తున్న చలి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. శీతాకాలానికి వాయుగుండం తోడు కావడంతో చలి విజృంభిస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన వాయుగుండంతో చలి గాలులు అధికమయ్యాయి. ఏటా నవంబర్ మూడో వారం చలికాలం సీజన్ ప్రారంభమవుతుండగా, ఈ ఏడాది మొదటి వారం నుంచే చలి ప్రతాపం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో 14, 16, 18 డి గ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, గోదావరి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో RED MORE
Saturday, November 17, 2012
ఉద్యోగం వచ్చిన తరువాతే పెళ్లి...సిఎం కిరణ్ కుమార్ రెడ్డి
స్వశక్తితోనే సాధికారిత సాధ్యం అని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత అంగసాన్‌సూకీ అన్నారు. శనివారం ఉదయం అనంతపురం జిల్లా పాపసానిపల్లిలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనీతీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూకీ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. తమ దేశంలో కూడా పథకాలు అమలు చేస్తామని సూకీ పేర్కొన్నారు.
ఉద్యోగాలు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాయిలకు సలహా ఇచ్చారు. మడకశిరలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సిఎం అయిన తరువాత లక్షా 20వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్యోగాల భర్తీలో సిఫారసులకు తావులేదని, ప్రతిభకే పట్టం అన్నారు. తాను, రఘువీరా రెడ్డి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆయన త్వరగా మంత్రి అయ్యారని తెలిపారు. తనకు మంత్రి పదవి రాలేదని, ఇక ఎప్పటికీ మంత్రిని కాలేనని ఆయన అన్నారు.
ఉద్యోగాలు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాయిలకు సలహా ఇచ్చారు. మడకశిరలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సిఎం అయిన తరువాత లక్షా 20వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్యోగాల భర్తీలో సిఫారసులకు తావులేదని, ప్రతిభకే పట్టం అన్నారు. తాను, రఘువీరా రెడ్డి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆయన త్వరగా మంత్రి అయ్యారని తెలిపారు. తనకు మంత్రి పదవి రాలేదని, ఇక ఎప్పటికీ మంత్రిని కాలేనని ఆయన అన్నారు.
పాతబస్తీలో ప్రశాంతం వాతావరణం
నగరంలోని పాతబస్తీలో ప్రశాంతం వాతావరణం నెలకొంది. పోలీసులు రాకపోకలను అనుమతించారు. దుకాణాలు తెరుచుకున్నాయి. శాలిబండ, చార్మినార్ వద్ద బారికేడ్లను తొలగించారు. చార్మినార్‌కు సందర్శకుల రాక మొదలైంది. రాత్రి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కొనసాగుతోంది. పాతబస్తీ పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పాత బస్తీ ప్రశాంతంగా ఉన్నప్పటికీ రేపటి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ...దిగ్విజయ్ సింగ్
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి బాధ్యతలు దిగ్విజయ్ సింగ్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగ్విజయ్‌కు శనివారంనాడు పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పూలగుచ్ఛం ఇవ్వడాన్నిబట్టి ఢిల్లీ రాజకీయ పరిశీలకులలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ వ్యవహారాన్ని త్వరగా తేల్చండి అని కాంగ్రెస్ నాయకులు పాల్వాయి, గండ్ర, చెంగారెడ్డి శనివారంనాడు దిగ్విజయ్‌ను కోరారు. కాబోయే ఇన్‌ఛార్జి దిగ్విజయ్ అని తెలిసిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పెక్కుమంది నాయకులు దిగ్విజయ్ ఇంటికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తనను కలుస్తున్నవారినుంచి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు.
Thursday, November 15, 2012
చంద్రబాబే ప్రభుత్వానికి అండ...షర్మిల
మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. ప్రజల మనసుల్లో కొలువైవున్న ఆయనను దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసినా ప్రతిపక్ష టీడీపీ మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయిందని దుయ్యబట్టారు.‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పెద్దకడబూరు చేరుకున్న షర్మిల అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. బాబు తన హయాంలో గ్రామాలను స్మశానాలుగా మార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ఇంకొక అవకాశం ఇమ్మంటున్నారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. అవిశ్వాసం పెట్టి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించొచ్చని సూచించారు. అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని నిలబెడుతోంది చంద్రబాబేనని షర్మిల ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఒక్క సాక్ష్యం లేకపోయినా విచారణ పేరుతో జగనన్నకు బెయిల్ రాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలో బయటకు వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
Wednesday, November 14, 2012
సీమాంధ్ర పార్టీలను తరిమికొట్టాలి... టీఆర్ఎస్
తెలంగాణ జిల్లాల్లో సీమాంధ్ర పార్టీ లను తరిమి కొ ట్టాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ శాసం రామకృష్ణ అన్నారు. మండల పరిధి దేవరఫస్లాబాద్ పంచాయతీ లొట్టికుంటతండాలో సోమవారం పార్టీ జెం డాను ఆవి ష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించకుండా దొంగతనంగా సీమాంధ్ర ప్రాంతాలకు తరలించుకుపోతున్నా పాలకులు అడ్డు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఆస్తులను సీమాం«ద్రులు ఇష్టనుసారం తమ ప్రాంతాలకు తరలించుకుని పోతున్నా ఏమీ పట్టనట్లు పాలకులు వ్యవహరిస్తుండడం చూస్తుంటే తెలంగాణ ప్రాంతాల పట్ల వారికి గల వివక్ష అర్థమవుతోందని అన్నారు. తెలంగాణ సాధన కోసం దాదాపు 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్లుగా కూడా లేద న్నారు.
Subscribe to:
Posts (Atom)