స్వశక్తితోనే సాధికారిత సాధ్యం అని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత అంగసాన్‌సూకీ అన్నారు. శనివారం ఉదయం అనంతపురం జిల్లా పాపసానిపల్లిలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనీతీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూకీ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. తమ దేశంలో కూడా పథకాలు అమలు చేస్తామని సూకీ పేర్కొన్నారు.
ఉద్యోగాలు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాయిలకు సలహా ఇచ్చారు. మడకశిరలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సిఎం అయిన తరువాత లక్షా 20వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్యోగాల భర్తీలో సిఫారసులకు తావులేదని, ప్రతిభకే పట్టం అన్నారు. తాను, రఘువీరా రెడ్డి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆయన త్వరగా మంత్రి అయ్యారని తెలిపారు. తనకు మంత్రి పదవి రాలేదని, ఇక ఎప్పటికీ మంత్రిని కాలేనని ఆయన అన్నారు.