నగరంలోని పాతబస్తీలో ప్రశాంతం వాతావరణం నెలకొంది. పోలీసులు రాకపోకలను అనుమతించారు. దుకాణాలు తెరుచుకున్నాయి. శాలిబండ, చార్మినార్ వద్ద బారికేడ్లను తొలగించారు. చార్మినార్‌కు సందర్శకుల రాక మొదలైంది. రాత్రి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కొనసాగుతోంది. పాతబస్తీ పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పాత బస్తీ ప్రశాంతంగా ఉన్నప్పటికీ రేపటి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.
Saturday, November 17, 2012
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ...దిగ్విజయ్ సింగ్
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి బాధ్యతలు దిగ్విజయ్ సింగ్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగ్విజయ్‌కు శనివారంనాడు పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పూలగుచ్ఛం ఇవ్వడాన్నిబట్టి ఢిల్లీ రాజకీయ పరిశీలకులలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ వ్యవహారాన్ని త్వరగా తేల్చండి అని కాంగ్రెస్ నాయకులు పాల్వాయి, గండ్ర, చెంగారెడ్డి శనివారంనాడు దిగ్విజయ్‌ను కోరారు. కాబోయే ఇన్‌ఛార్జి దిగ్విజయ్ అని తెలిసిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పెక్కుమంది నాయకులు దిగ్విజయ్ ఇంటికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తనను కలుస్తున్నవారినుంచి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు.
Thursday, November 15, 2012
చంద్రబాబే ప్రభుత్వానికి అండ...షర్మిల
మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. ప్రజల మనసుల్లో కొలువైవున్న ఆయనను దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసినా ప్రతిపక్ష టీడీపీ మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయిందని దుయ్యబట్టారు.‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పెద్దకడబూరు చేరుకున్న షర్మిల అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. బాబు తన హయాంలో గ్రామాలను స్మశానాలుగా మార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ఇంకొక అవకాశం ఇమ్మంటున్నారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. అవిశ్వాసం పెట్టి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించొచ్చని సూచించారు. అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని నిలబెడుతోంది చంద్రబాబేనని షర్మిల ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఒక్క సాక్ష్యం లేకపోయినా విచారణ పేరుతో జగనన్నకు బెయిల్ రాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలో బయటకు వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
Wednesday, November 14, 2012
సీమాంధ్ర పార్టీలను తరిమికొట్టాలి... టీఆర్ఎస్
తెలంగాణ జిల్లాల్లో సీమాంధ్ర పార్టీ లను తరిమి కొ ట్టాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ శాసం రామకృష్ణ అన్నారు. మండల పరిధి దేవరఫస్లాబాద్ పంచాయతీ లొట్టికుంటతండాలో సోమవారం పార్టీ జెం డాను ఆవి ష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించకుండా దొంగతనంగా సీమాంధ్ర ప్రాంతాలకు తరలించుకుపోతున్నా పాలకులు అడ్డు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఆస్తులను సీమాం«ద్రులు ఇష్టనుసారం తమ ప్రాంతాలకు తరలించుకుని పోతున్నా ఏమీ పట్టనట్లు పాలకులు వ్యవహరిస్తుండడం చూస్తుంటే తెలంగాణ ప్రాంతాల పట్ల వారికి గల వివక్ష అర్థమవుతోందని అన్నారు. తెలంగాణ సాధన కోసం దాదాపు 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్లుగా కూడా లేద న్నారు.
Tuesday, November 13, 2012
రాష్ట్రంలో రెచ్చిపోతున్న హిజ్రాలు
రాష్ట్రంలో పలు చోట్ల హిజ్రాలు రెచ్చిపోతున్నారు. కేవలం యాచకులుగా భావించి ప్రజలు, పోలీసులు వారిని అలా వదిలివేయడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లింగపరమైన సమస్య తప్ప వారికి ఏ లోపం ఉండదు. కొందరు లింగమార్పిడి చేసుకున్నవారు కూడా ఉంటారు. ఇటీవల కాలంలో లింగమార్పిడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వారు అన్ని రకాల పనులు చేయగలరు. చేస్తారు కూడా. ఏ పని చేయడానికైనా వారి శరీరం అనువుగానే ఉంటుంది. కానీ వారిలో ఎక్కువ మంది పనిపాట లేకుండా చప్పట్లు కొడుతూ యాచనకు అలవాటుపడిపోయారు. ఏ పని చేయకుండా కాలం గడిచిపోతుండటంతో వారు అరాచకాలకు పాల్పడుతున్నారు. హత్యలకు, దోపిడీలకు కూడా తెగబడుతున్నారు. లింగ మార్పిడి చేసుకున్న కొందరు వ్యభిచారానికి అలవాటు పడితే, మరికొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు ప్రాంతాలలో వారు తమ వికృత చేష్టలతో యువతీయువకులను, బాలురను వేధిస్తున్నారు. ముఖ్యంగా వారు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, బైపాస్ రోడ్లలో ఎక్కవగా ఉంటారు. రైళ్లలో వారి ఆగడాలకు హద్దులు లేవు. రైల్వే పోలీసులు చూసిచూడనట్లు వదిలివేయడంతో వారు రెచ్చిపోతున్నారు. రైళ్లలో చప్పట్లు చరుస్తూ వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెడతారు. వారు అడిగినంత ఇవ్వాలి. ఇవ్వకపోతే హింసే. కుర్రవాళ్లని నానారకాలుగా ఇబ్బందిపెడతారు. వారిమీదకు ఎగబడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని దోచేస్తారు. వారికి ఎదురు తిరిగి నిలబడటం కష్టం. మహిళలను కూడా వేధిస్తారు. వికృత చేష్టలతో హింసిస్తారు. కొన్ని సందర్భాలలో వారి చేష్టల వల్ల ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. బైపాస్ రోడ్లలో రాత్రి అవ్వగానే మొదలుపెట్టి, తెల్లవారుజాము వరకు అక్రమవసూళ్లు కొనసాగిస్తారు. వాహనదారులను వేధిస్తారు. డబ్బు కోసం వారు దేనికైనా తెగిస్తారు.
హైదరాబాద్‌లో 12.12.12న 'చూమంతర్'
వచ్చే నెల 12వ తేదీన 12.12 గంటలకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ మెజీషియన్స్ సదస్సు 'చూ మంతర్'కు బ్రోచర్‌ను సోమవారం నాడిక్కడ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. సాంస్కృతిక శాఖ, మెజీషియన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, సదస్సు కన్వీనర్ సామల వేణు ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
Sunday, November 11, 2012
హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్!
హైదరాబాద్ పాతబస్తీ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. చార్మినార్ ప్రాంగణంలోనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం కేంద్రంగా ఇటు మతపరమైన, అటు రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. పాతబస్తీలోని చార్మినార్ కు ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయ మరమ్మతులు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. దీపావళి పండుగ సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న ఆలయ షెడ్‌ను ఈ నెల 1న తొలగించి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. అది చూసిన మరో వర్గం ప్రజలు ఆలయాన్ని విస్తరిస్తున్నారని అపార్ధం చేసుకున్నారు. పనులకు అడ్డుతగిలారు. ఆ తరువాత ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ ఆందోళనకు దిగటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ తరువాత దేవాలయ నిర్వాహకురాలి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వక్తం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు లోబడి ఆదివారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్బంగా మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పాతబస్తీ భగ్గుమంది.
Subscribe to:
Posts (Atom)