నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి, విద్రోహదినంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకటో తేదీన తెలంగాణ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేయాలని ఆయన తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులను సూచించారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో నిరసన తెలపాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.
Tuesday, October 30, 2012
Saturday, October 27, 2012
చంద్రబాబును పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్
గద్వాల్ సభలో శుక్రవారం రాత్రి గాయపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్‌ను ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ శనివారం ఉదయం గద్వాల్‌కు బయలుదేరి వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ సభావేదిక కూలి గాయపడిన మామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చానని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టిలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు. షూటంగ్ తేదీలను వెసులుబాటు చూసుకుని తాను కూడా బాబు పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.
మహిళలతో షర్మిల రచ్చబండ
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పదవరోజు జిల్లాలోని గొల్లపల్లిలో షర్మిల శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బడంగపల్లి చేరుకున్న షర్మిల అక్కడి వేరుశనగ పంటలు పరిశీలించి రైతుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనంతరం శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుడంగపల్లెలోని మహిళలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ సీఎం భార్య కూడా 3 కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుంటే తప్ప ప్రజలు బాధలు తెలుసుకోలేరని విమర్శించారు. అక్కడ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి నిక్షేపంగా ఉన్నారని, ఇక్కడ మాత్రం ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
Saturday, October 13, 2012
నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల సమ్మె
విద్యుత్ కోతలతో పెట్రోలు బంకుల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ రాజీవ్ అమరం పేర్కొన్నారు. చమురు కంపెనీలు కమీషన్ పెంచేందుకు ముందుకు రాకపోవడంతో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు శనివారం విలేకరులకు తెలిపారు. సమ్మె రోజుల్లో ఒక్క షిఫ్ట్‌లో మాత్రమే పెట్రోలు బంకుల్లో విక్రయాలుంటాయని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అవుట్‌లెట్‌లు పనిచేస్తాయని తెలిపారు. హైవేలోని అవుట్‌లెట్లలో రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకే అమ్మకాలు ఉంటాయన్నారు.
రాయలసీమ ప్రజలారా మేల్కొనండి...బైరెడ్డి
పార్టీలకతీతంగా ప్రజలు, నాయకులు కలిసి రాయలసీమ హ క్కుల కోసం పోరాటం చేసి ప్రత్యేక సీమ సాధిద్దామని ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలుజిల్లా నుంచి కడప జిల్లాలో బైరెడ్డి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామ సరిహద్దులో మహిళా కూలీలు బైరెడ్డిని కలిసి జై రాయలసీమ అంటూ నినాదాలు చేస్తూ పూలమాల వేసి స్వాగతించారు. గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ అని, ఐక్యత ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. రాయలసీమ ఎన్నో సహజ వనరులకు నిలయమైన ప్రాంతం అన్నారు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే శ్రీబాగ్ ఒడంబడిక నీరుగారిపోయిందన్నారు. కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టులను పోగొట్టుకున్నామన్నారు. పాదయాత్ర అనంతరం నవంబరు 10వ తేదీ అనంతపురంలో జరిగే బహిరంగసభలో రాయలసీమ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఆనందంగా ఉంది...మహేశ్‌బాబు
ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉందని హీరో మహేశ్‌బాబు పేర్కొన్నారు. 14 రీల్స్ టీమ్ మొత్తానికి, దర్శకుడు శ్రీను వైట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2011 సంవత్సరానికిగానూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన నంది అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మహేశ్‌బాబు ఎంపికయ్యారు. దూకుడు చిత్రానికిగానూ ఆయనకీ అవార్డు దక్కింది. 14 రీల్స్ పతాకంపై నిర్మించిన దూకుడు సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కించారు.
నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం
2011 సంవత్సరానికి గాను తెలుగు సినిమా నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం, రెండో ఉత్తమ చిత్రంగా రాజన్న, మూడో ఉత్తమ చిత్రంగా విరోధి ఎంపిక అయ్యాయి. ఉత్తమ నటుడుగా మహేష్‌బాబు, ఉత్తమ నటిగా నయన తార, ఉత్తమ దర్శకుడుగా శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు.
ఉత్తమ చిత్రం : శ్రీరామరాజ్యం
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న
ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : 100 పర్‌సెంట్ లవ్
ఉత్తమ సమగ్రత చిత్రం : జై భోలో తెలంగాణ
ఉత్తమ పాపులర్ చిత్రం : దూకుడు
ఉత్తమ తొలి బాలల చిత్రం : శిఖరం
ఉత్తమ ద్వితీయ బాలల చిత్రం : గంటల బడి
ఉత్తమ తొలిడాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం
ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రం : మన బాధ్యత
ఉత్తమ నటుడు : మహేష్‌బాబు (దూకుడు)
ఉత్తమ నటి : నయనతార (శ్రీరామరాజ్యం)
ఉత్తమ దర్శకుడు : శంకర్ (జైబోలో తెలంగాణ)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాశ్ రాజ్(దూకుడు)
ఉత్తమ సహాయ నటి : సుజాతారెడ్డి (ఇంకెన్నాళ్లు)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ (రాజన్న)
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్.ఎస్ నారాయణ (దూకుడు)
ఉత్తమ హాస్య నటి : రత్నసాగర్ (కారాలు-మిర్యాలు)
ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ బాల నటుడు : మాస్టర్ నిఖిల్ (100 పర్సెంట్ లవ్)
ఉత్తమ బాల నటి : బేబీ ఆన్వీ (రాజన్న)
ఉత్తమ స్కీన్‌ప్లే రచయిత : శ్రీనూవైట్ల (దూకుడు)
ఉత్తమ డైలాగ్ రైటర్ : నీలకంఠ (విరోధి)
ఉత్తమ లిరిక్ రైటర్ : మథుపల్లి సురేంధర్ ( రాతి బొమ్మలోన కొలువైన శివుడు - పోరు తెలంగాణ)
ఉత్తమ సినిమాటోగ్రఫి : పీఆర్‌కే రాజు (శ్రీరామరాజ్యం)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజ (శ్రీరామరాజ్యం)
ఉత్తమ ప్లేబాక్ గాయకుడు : గద్దర్ (పొడుస్తున్న పొద్దుమీద - జై బోలో తెలంగాణ)
ఉత్తమ ప్లేబాక్ గాయని : మాళవిక ( అమ్మా అవని - రాజన్న)
ఉత్తమ ఎడిటర్ : ఎంఆర్ వర్మ ( దూకుడు )
ఉత్తమ ఆర్ట్ డిజైనర్ : రవీందర్
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శ్రీను (జగదానందతారక - శ్రీరామరాజ్యం)
ఉత్తమ ఆడియో గ్రాఫర్ - దేవి కృష్ (బద్రీనాథ్)
ఉత్తమ కాస్టూమ్ డైరెక్టర్ - నిఖిల్ దాన్, భాషా (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - రాంబాబు ( శ్రీరామరాజ్యం)
ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - ఆర్‌సీఎమ్ రాజు ( పోరు తెలంగాణ)
ఉత్తమ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - సునీత ( శ్రీరామరాజ్యం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ మేల్ - నాగార్జున (రాజన్న)
స్పెషల్ జ్యూరీ అవార్ట్ ఫీమేల్ -చార్మి ( మంధర)
స్పెషల్ జూరీ అవార్ట్ - రమేష్ (ఋషి)
Subscribe to:
Posts (Atom)