భారత క్రికెట్ జట్టు కెప్టన్ ధోనీపై అనంతపురంలో కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఓ బిజినెస్ వారపత్రికపై మార్కెట్ గాడ్ గా సంభోదిస్తూ ధోనీని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీహెచ్ పీ జనరల్ సెక్రటరీ శ్యాంసుందర్ ఈ పిటీషన్ దాఖలు చేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటీషన్ లో విజ్ఞప్తి చేసారు. పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు వారపత్రిక ఎడిటర్, దోనీపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇదే విషయంపై బెంగళూరులోని ఒక సామాజిక ఉద్యమకారుడు జయకుమార్ గతంలో 6 వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటుకు మే 12 వ తేదీన దేవుడిగా సంభోదిస్తూ హిందువుల మనోభావాలు కించపరిచారని ఫిర్యాదు చేసారు.
No comments:
Post a Comment