http://apvarthalu.com/

Saturday, September 28, 2013

'అనగనగ' మూవీ హాట్ స్టిల్స్









నలుగురు కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా!

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు.  రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శనివారం మధ్యాహ్నంread more

Friday, September 27, 2013

అత్తారింటికి దారేది ‘రివ్యూ’

నటీనటులు- పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత, నదియా, బొమన్ ఇరానీ, ముఖేష్ రుషి, రావు రమేష్, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు తదితరులు
సంగీతం- దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ- ప్రసాద్ మూరెళ్ల
నిర్మాత- బీవీఎస్ఎన్ ప్రసాద్
రచన, దర్శకత్వం- త్రివిక్రమ్
‘అత్తారింటికి దారేది’ అందరూ అనుకుంటున్నట్లు అద్భుతమైన సినిమా కాదు. ఇందులో గొప్ప కథ లేదు. గొప్ప మలుపుల్లేవు. గొప్ప సన్నివేశాల్లేవు.. గొప్ప పాత్రల్లేవు. గొప్ప నటనా లేదు.. ఇదొక సాదాసీదా సినిమా. కానీ ఇది అందరూ మెచ్చే సినిమా. త్రివిక్రమ్.. తన పె(గ)న్ను నిండా వినోదం నింపి వదిలిన బుల్లెట్టు ‘అత్తారింటికి దారేది’. ‘గబ్బర్ సింగ్’తర్వాత ఆ స్థాయి వినోదానికి ముఖం వాచిపోయిన తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి మళ్లీ పవన్ కళ్యాణే నడుం బిగించాడు. కొన్ని నెలలుగా సరైన సినిమాల్లేక వెలవెలబోయిన తెలుగు తెరను రంగుల మయం చేసింది ‘అత్తారింటికి దారేది’read more

Monday, September 16, 2013

ఆరంభశూరులు..అరివీర భయంకరులయ్యారు!

ప్రజలను బ్లఫ్ చేయడం రాజకీయ నాయకులు పెద్ద సంగతేమీ కాదు.. రాజకీయం పరంగా ఎన్నో పొరపాట్లు చేసి, పాలన విషయంలో ప్రజలకు చుక్కలు చూపెట్టి.. తమకు అవసరమైన సందర్భాల్లో ప్రజలను ఏదో విధంగా మాయ చేయడం మన రాజకీయ నాయకులకు చాలా సులభమైన పని. లక్షల కోట్ల స్కామ్ లకు ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వాధి నేతలు.. ఉదయం లేస్తూనే హితబోధలు చేయడం, తమ ముందు ప్రభుత్వాలు జనాలను దోచుకున్నాయని ఆందోళన వ్యక్తం చేయడం, కేంద్రంలో తమపై వస్తున్న ఆరోపణలపై మారు మాట్లాడక.. తమ ప్రత్యర్థులు ఏలుతున్న రాష్ట్రాల్లో అవినీతి ఏరులై ప్రవహిస్తోందని ఆందోళన వ్యక్తం చేయడం చేస్తూనే ఉన్నాం. ఎవరి తీరు ఏమిటో తెలిసిన ప్రజలు కూడా.. ఇదంతా రాజకీయంలే అని సర్దుకుపోతుంటారు. రాజకీయ అనైతికంగా ప్రవర్తించినా.. ఎలాంటి డ్రామాలు ఆడినా.. సాధారణంగా ప్రజలు నాయకులను క్షమించేస్తుంటారు. అయితే తమను రాజకీయ నాయకులు పరోక్షంగా దోచుకున్న సందర్భాల్లో, పన్నులు గట్రా వాటితో ప్రత్యక్ష్యంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో… కూడా ప్రజలు సహనం వహించారు. అయితే.. అన్నింటినీ మౌనంగా భరించే భారతీయులు కూడా భారీ ఉద్యమాలు చేయగలరని, తిరుగుబాటుకు కూడా వెనుకాడరని.. ఆరంభశూరులు అని పేరున్న ఆంధ్రులు 46 రోజులు గడిచిపోయినా.. శూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతల మీద!read more 

1985లో ఆడిన క్రికెట్ బ్యాట్ 4.5 లక్షలు!

1985లో క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్ వేలంలో భారీ ధర పలికింది. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో ఆడిన బ్యాట్ ను ఇటీవల వేలంగా వేయగా 4.5 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఈ మెగా ఈవెంట్ లో పాల్గొన్న అన్ని దేశాల జట్ల క్రికెటర్లు బ్యాట్ పై సంతకాలు చేశారు.read more