http://apvarthalu.com/

Sunday, September 15, 2013

సీఎం కిరణ్‌ పద్ధతి మార్చుకోకుంటే కేబినెట్‌లోఉండలేం:తెలంగాణ మంత్రులు

తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సీమాంధ్ర మంత్రుల తీరు భరించలేకుండా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం అభిప్రాయపడింది. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశంలో  ఏడుగురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.  read more

తెలంగాణ విషయంలో తేల్చేసిన బొత్స !

కాంగ్రెస్ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వెనక్కు వెళ్లే ప్రసక్తి ఉండదు. నిర్ణయం జరిగిపోయాక ఎంత ఇబ్బంది అయినా ఎదుర్కుంటుంది. మాది జాతీయ పార్టీ. మిగతా పార్టీల మాదిరిగా ఊసరవెల్లిలా రంగులు మార్చాలంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన భాధ్యత కార్యకర్తలదే” అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిని బట్టి తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మారదని ఆయన తేల్చిచెప్పారు.read more

Friday, September 13, 2013

బాబు లేఖ తెలుగుప్రజల హత్య

తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖ తెలుగు ప్రజలను హత్య చేయడంతో సమానం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా అక్కడ కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్‌ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం అంటే ఒక వ్యక్తిని హత్య చేసి ఆ వ్యక్తి మీదనే పడి ఏడవడం లాంటిది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల అన్నారు.  రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు నీళ్లు, నిధులు, లేక పూర్తిగా దెబ్బతింటారని ఆమె ఆరోపించారు.read more

Saturday, September 7, 2013

హీరోయిన్‌ సింధూ మీనన్ ఆత్మహత్యాయత్నం!

చందమామ, వైశాలి చిత్రాల్లో నటనతో  ప్రశంసలందుకున్న కధానాయిక సింధూ మీనన్ గత రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. దక్షిణాది నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం వార్తతో చిత్ర పరిశ్రమ దిగ్ర్బాంతికి లోనైంది. read more

Friday, September 6, 2013

‘తుఫాన్’ రివ్యూ

నటీనటులు- రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, ప్రకాష్ రాజ్, మహి గిల్, శ్రీహరి, తనికెళ్ల భరణి తదితరులు
నేపథ్య సంగీతం- గౌరంగ్ సోని
సంగీతం-మీట్ బ్రోస్ అంజన్, చిరంతన్ భట్, ఆనంద్ రాజ్ ఆనంద్
నిర్మాణం- రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం-అపూర్వ లఖియా

అడవిలాంటి ఓ ప్రాంతంలో హీరోయిన్ కారును గుద్దేసి ఆమె వెంటపడి వస్తుంటారు విలన్లు.. ఆమె పరుగెత్తుకుంటూ రోడ్డు మీదికి రాగానే వెంటనే హీరో కారుతో సహా ప్రత్యక్షమవుతాడు.

హీరో, హీరోయిన్ కార్లో వస్తుంటారు. రోడ్లో ఒకతను యాక్సిడెంటై పడుంటాడు. ఏమైందోనని ఆ పడి ఉన్న వ్యక్తిని తిప్పబోతే చుట్టూ రౌడీలు. ఫైటు..raed more