http://apvarthalu.com/

Friday, October 11, 2013

‘రామయ్యా వస్తావయ్యా’ రివ్యూ

‘రామయ్యా వస్తావయ్యా’ ఎందుకు చూడాలి?

ఎన్టీఆర్ ఇంత అందంగా ఎప్పుడూ ఎవరూ చూపించలేదు. ఎన్టీఆర్ ఇంతటి యూత్ ఫుల్ క్యారెక్టర్లో ఎప్పుడూ కనిపించలేదు. అతనింత అల్లరి ఏ సినిమాలోనూ చేయలేదు. ఎన్టీఆర్ డ్యాన్సులకు తిరుగులేదు. పాటలు చాలా రిచ్ గా, గ్రాండ్ గా ఉన్నాయి. కామెడీ బావుంది. పంచ్ లు అదిరిపోయాయి. సమంత అందంగా కనిపించింది. కానీ ఇదంతా ద్వితీయార్ధం ముందు మాట!
ఇప్పుడు ‘రామయ్యా వస్తావయ్యా’ ఎందుకు చూడకూడదో తెలుసుకుందాం.
కథ మొదలు కానంతవరకు బాగానే ఉంది. కథంటూ మొదలయ్యాకే ఉంది అసలు కథ. ఇప్పటికి లెక్కపెట్టుకోలేనన్ని సార్లు చూసిన, ఏమాత్రం ఆసక్తి కలిగించని రొటీన్ కథ.. పేలవమైన ఫ్లాష్ బ్యాక్, ఏమాత్రం ఆసక్తి కలిగించని, విసుగు పుట్టించే ప్రేమకథ.. ఏమాత్రం సూటవని పాత్రలో కనిపించిన ప్రతిసారీ చికాకు పుట్టించే శ్రుతి హాసన్, జుగుప్స పుట్టించే రవిశంకర్ పాత్ర, అసహ్యం పుట్టే మాటలు.. అర్థం లేని పాటలు.. ఇలా చాలానే ఉన్నాయి.
సింపుల్ గా చెప్పాలంటే.. పునాది గట్టిగా వేసి, ఆపై నాసిరకం పనులతో బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందో అలా ఉంది ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా. ఎన్టీఆర్ ఏం నచ్చి ఏ సినిమా ఒప్పుకున్నాడో..? జడ్జిమెంట్ కింగ్ గా పిలవబడే దిల్ రాజు ఈ కథకు ఎలా పచ్చ జెండా ఊపాడో..? షాక్’ లాంటి ఫ్లాప్ సినిమాలో కూడా ప్రత్యేకత చూపించిన హరీష్ శంకరేనా ఈ సినిమా తీసింది..? ఇలా రకరకాల అనుమానాలు కలుగుతాయి ఈ సినిమా చూశాక. కథాకథనాలు ఎంత పాతగా ఉన్నా పర్లేదు.. సన్నివేశాల్లో కొత్తదనం లేకపోయినా పర్లేదు.. యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్ అందిస్తే తెలుగు ప్రేక్షకులు సినిమా హిట్ చేసేస్తారన్న గట్టి నమ్మకంతో ఉన్నారు మన దర్శక నిర్మాతలు. ఐతే ఈ సూత్రం ప్రథమార్ధం వరకు బాగానే పని చేసింది. కానీ ద్వితీయార్ధంతో వచ్చింది తంట. ఆ మధ్య వచ్చిన ‘ఊసరవెల్లి’లో ఫ్లాష్ బ్యాక్ సినిమాను ఎలా చెడగొట్టిందో ఇందులో అదే జరిగింది.read more

No comments: