కాంగ్రెస్‌పై వీధుల్లో తొడలు కొడుతున్నా చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవిశ్వాసం పెడితే తమతో ఎందుకు కలిసిరావడంలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. ‘మీది చిత్తూరు, మాది చిత్తూరు’ అనే ప్రాతిపదికన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల అక్రమ సంబంధం ఇవాళ్టితో బయటపడిందని ఆయన అన్నారు.red more
Wednesday, March 13, 2013
Tuesday, March 12, 2013
Saturday, March 9, 2013
Wednesday, March 6, 2013
హైదరాబాద్ కు పోలీసులు తాజా హెచ్చరిక !
రాష్ట్రంలో ఉగ్రవాదులు విధ్వంసక పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో హైదరాబాదులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. రోడ్లపై, లాడ్జీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు. లుంబినీ పార్క్‌లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఐమాక్స్ వద్ద ఆక్టోపస్ సోదాలు చేస్తోంది.శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లతో భయభ్రాంతులకు గురైన హైదరాబాదీలు తాజా హెచ్చరికలతో వణికిపోతున్నారు. అప్పట్లో నిఘా హెచ్చరికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు రావడంతో ఈసారి పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గత నెల జరిగిన బాంబు దాడి నేపథ్యంతో నగరమంతా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు తాజా హెచ్చరికలతో మరింత క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తున్నారు. ఇటు నగరవాసులు కూడా తమ బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు.red moreMonday, March 4, 2013
Subscribe to:
Comments (Atom)


















red more phots 




